వచ్చే ఎన్నికల్లో భారీగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించి.. హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ చూస్తుంటే మరోపక్క ఆ పార్టీకి చెందిన లీడర్లు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ రాసలీలల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఓ మహిళతో ఉన్న ఫోటోలు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
అయితే వైరా బీఆర్‌ఎస్ టికెట్ మదన్ లాల్‌కే వస్తుందని.. అది తట్టుకోలేక కుట్రపూరితంగా ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం ఇటువంటి ఫోటో మార్ఫింగ్ చేస్తున్నారని మదన్ లాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఆ ఫోటోలు నిజం కాదని అవి మార్ఫింగ్ ఫోటోలని అంటున్నారు. ఇప్పటివరకు దీనిపై బానోతు మదన్ లాల్ ఇప్పటి వరకు స్పందించలేదు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన వేళ ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులెవరో తేలిపోనుంది. అధికార పార్టీ ఫస్ట్ లిస్ట్ సోమవారం విడుదల కానుంది. 90కి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని తెలిసింది. నిజానికి నాలుగైదు సీట్లు మినహా మిగతా అన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటిస్తారని మొదట ప్రచారం జరిగింది.
కానీ ఫస్ట్ లిస్ట్ లో 90 మందికి పైగా అభ్యర్థుల పేర్లు ఉండొచ్చని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం ఆరు అంకె వచ్చేలా అభ్యర్థుల సంఖ్య ఉంటుందని సమాచారం.