ఎక్స్ యూజర్లకు షాక్.. రెండు లక్షల అకౌంట్లు బ్లాక్

ఎక్స్ యూజర్లకు షాక్.. రెండు లక్షల అకౌంట్లు బ్లాక్

భారత్ లోని ఎక్స్ యూజర్లకు ఎలాన్‌ మస్క్‌ షాకిచ్చారు. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 వరకు ముగిసిన నెలలో 5,06,173 మంది ఖాతాలను ఎక్స్‌ నిషేధించిన విషయం తెలిసిందే.- తాజాగా మరో 2 లక్షల మందికిపైగా ఖాతాదారుల అకౌంట్లను ఎక్స్‌ కార్ప్‌ బ్లాక్‌ చేసింది. భారతీయ వినియోగదారుల నుంచి 5,158 కంప్లెయింట్స్ అందాయని, తమ గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ మెకానిజం ద్వారా వాటిని పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు.

 
ఈవేరకు  పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలత, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్‌ కట్టడిలో భాగంగా మార్చి నెలలో ఏకంగా 2లక్షల12 వేల 627 ఖాతాలపై నిషేధం విధించినట్లు ఎక్స్ ప్రకటించింది. ఫ్రిబవరి 26 నుంచి మార్చి 25 వరకు భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకుగాను 1,235 ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఎక్స్ మంథ్లీ రీపోర్ట్ లో తెలిపింది. మొత్తంగా ఈ రిపోర్టింగ్‌ సైకిల్‌లో దేశవ్యాప్తంగా 2 లక్షల13 వేల 862 ఖాతాలపై నిషేధం విధించినట్లు తెలిపింది.