ఎక్స్‌బాక్స్‌లో గేమ్స్ ఆడుతుంటారు చాలామంది. దానికోసం వేలకు వేలు పెట్టి ‘పిఎస్ ఎక్స్‌బాక్స్’లను కొంటుంటారు. అయితే ఇకనుంచి అంత ఖర్చు చేయాల్సిన పనిలేదు అంటోంది మైక్రోసాఫ్ట్. శామ్‌సంగ్, ఎక్స్‌బాక్స్ కలిసి శామ్‌సంగ్ టీవీల్లో ఎక్స్‌బాక్స్ యాప్ తీసుకొస్తున్నాయి. దీనికోసం ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ అల్టిమేట్ సబ్‌స్ర్కిప్షన్ తీసుకోవాలి. 100 గేమ్స్ కోసం 499 రూపాయలు ఖర్చు అవుతుంది.