ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, గత ఏడాది డిసెంబర్‌లో చాట్‌జీపీటీకి పోటీగా సొంత ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ఏఐ(GrokAI)ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ట్రెండింగ్ స్టోరీలతో యూజర్లకు కనెక్ట్ అయ్యేలా ఉంది ఇది. ట్రెండింగ్ అవుతున్న టాపిక్స్‌ని లింక్ చేసిన పోస్ట్‌లకు సంబంధించిన ఏఐ స్టోరీలను ప్రీమియం సబ్స్క్రయిబర్లకు అందిస్తుంది ఇప్పుడు. ఈ ఏఐ చాట్‌బాట్ యాక్సెస్ వెబ్, ఐఓఎస్‌లలో ‘ఎక్స్’ ప్రీమియం, ప్రీమియం ప్లస్ యూజర్లకు అందుబాటులో ఉంది.
ఈ స్టోరీలను ‘Explore’ సెక్షన్‌లో ‘For You’ ట్యాబ్‌లో యాక్సెస్ చేయొచ్చు. ‘For You’ పేజీలో యూజర్ల ఇంట్రెస్ట్‌కి తగ్గట్టు స్టోరీలు, న్యూస్ టాపిక్స్ చూపిస్తుంది. ఒరిజినల్ స్టోరీల్లో టెక్స్ట్ మాత్రమే డిస్‌ప్లే అయ్యేలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను డైనమిక్‌గా ఒకేచోట చూపిస్తుంది. ట్రెండింగ్ విషయాలపై లేటెస్ట్ డాటాను ఎప్పటికప్పుడు ఇస్తుంటుంది. అయితే, అప్పుడప్పుడు ఇందులో లోపాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో ప్రతి ఆర్టికల్ చదివే సమయంలో యూజర్లకు అలెర్ట్ వస్తుంటుంది.