ఎలన్ మస్క్ ఎక్స్.. డౌన్ అయ్యింది. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో.. చాలా మందికి కంటెంట్ అప్ లోడ్ కావటం లేదు. 2024, ఆగస్ట్ 28వ తేదీ ఉదయం నుంచి ఈ సమస్య తలెత్తింది. దీనిపై ఇప్పటికే 40 వేలకు పైగా కంప్లయింట్స్ రైజ్ అయ్యాయి. ఇన్ని కంప్లయింట్స్ వచ్చినా.. ఇప్పటి వరకు అధికారికంగా ఎక్స్ నుంచి ఎలాంటి రిప్లయ్ రావటం లేదని ఎక్స్ యూజర్లు అంటున్నారు.
ఎక్స్ ప్లాట్ ఫాం ఆటోమేటిక్ గా ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోతుందని కొంత మంది యూజర్లు అంటున్నారు. అందరికీ ఈ సమస్య రావటం లేదు. కొంత మందికి మాత్రమే వస్తుంది. దీంతో ఇది లోకల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సమస్య అని కొంత మంది కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది DNS సంబంధిత సమస్య అయ్యి ఉండొచ్చు అని చెబుతున్నారు.
ఎక్స్ లో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Grok ఆప్షన్ వచ్చింది. దీనికితోడు మరిన్ని అప్ డేట్ వెర్షన్స్ రిలీజ్ చేసింది ఎక్స్. అప్పటి నుంచే తరచుగా ఎక్స్ లో సమస్యలు వస్తున్నాయని అంటున్నారు యూజర్లు.
Also Read:-‘మీడియాకు మేత దొరికింది’
ఏదిఏమైనా ఎక్స్ సమస్య మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు.. దీంతో ఇది ఆయా కస్టమర్ల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఎదురవుతున్న సమస్యగా చెబుతున్నారు చాలా మంది యూజర్లు.