ఎలన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసిన తర్వాత వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. బ్లూ టిక్ ఆప్షన్ తీసేయడం, తర్వాత ఛార్జ్ విధించడం, ఏకంగా ట్విటర్ పేరునే ఎక్స్ మార్చడం, లోగో మార్చడం వంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడూ ఎక్స్ సీఈఓ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఎక్స్ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్తగా Xలో లాగిన్ అయ్యే యూజర్లకు షాక్ ఇచ్చింది.
Xలో పోస్ట్ పెట్టాలన్నా, వాటికి లైక్ కొట్టాలన్నా, ట్విట్ చేయాలన్నా మరియు ట్విట్లకు రిప్లే ఇవ్వాలన్నా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తామని ఎక్స్ అధికారిక ఖాతా ప్రకటించింది. ఈ ఛార్జీలు అతంతం మాత్రమే ఉంటాయని ఎక్స్ సీఈఓ ఎలన్ మాస్క్ తెలిపారు. ఈ విధానం ఇప్పటికే న్యూజిల్యాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో అమలులో ఉంది. ఫేక్ అకౌంట్లను నియంత్రించడం, స్పామ్ కట్టడి చేయడం, యూజర్ల ఎక్స్పీరియన్స్ ను మెరుగుపరచడం కోసం ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎక్స్ సీఈఓ ఎలన్ మాస్క్ తెలిపారు.