
చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ రియల్మీ ఇండియా మార్కెట్లోకి సోమవారం ఎక్స్7 మ్యాక్స్ 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. మీడియా టెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరాలు, 120 హెజ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 50వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఎక్స్ 7 మాక్స్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.27 వేలు కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ రేటు రూ.30 వేలు. ఇదిలా ఉంటే 43, 50 ఇంచుల 4కే టీవీలను కూడా రియల్మీ లాంచ్ చేసింది. 4కే రిజల్యూషన్, డాల్బీ విజన్ , డాల్బీ అట్మోస్, వై-ఫై , బ్లూటూత్ కనెక్టివిటీలు వీటి ప్రత్యేకతలు.