
హైదరాబాద్, వెలుగు: అత్యంత వేగంగా ఛార్జింగ్ ఎక్కే స్మార్ట్‌ఫోన్ ‘షావోమి 11ఐ హైపర్‌ఛార్జ్’ ను గచ్చిబౌలిలోని సెల్‌బే స్టోర్‌లో లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్ అవుతుందని కంపెనీ చెబుతోంది. నటి సుభశ్రీ రాయగురు, సెల్‌బే ఎండీ నాగరాజ్ సోమ, సెల్‌బే డైరెక్టర్ సుహాస్ నల్లచెరు, షావోమి జోనల్ మేనేజర్ శివేందర్ సింగ్, షావోమి స్టేట్ హెడ్ సయ్యద్ అన్వర్‌లు ఈ లాంచింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అత్యంత వేగంగా ఛార్జింగ్ ఎక్కే షావోమి 11ఐ ని లాంచ్ చేయడం ఆనందంగా ఉందని సెల్‌బే ఎండీ సోమ నాగరాజు అన్నారు. లేటెస్ట్ టెక్నాలజీని తెచ్చేందుకు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటామని షావోమి స్పోక్స్ పర్సన్ చెప్పారు. షావోమి 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 120 హెడ్జ్ ఎఫ్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. డాల్బీ ఆటమ్స్, 108 ఎంపీ ట్రిపుల్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.