
గాడ్జెట్ ప్రపంచంలో తనదైన ట్రెండ్ క్రియేట్ చేయడాన్ని షావోమీ కంటిన్యూ చేస్తోంది. మొదట మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఆ కంపెనీ కొద్ది కాలం లోనే అనేక రకాల స్మార్ట్ ప్రొడక్టులను తెచ్చి ఫ్యాన్స్‌కు ఫీచర్ల విందు వడ్డించింది. అదే తరహాలో ఇప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. షావోమీ 12 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేయడానికి రెడీ అయింది. ఈ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను డిసెంబర్ 28న లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో భాగంగా షావోమీ 12, షావోమీ 12ఎక్స్, షావోమీ 12 ప్రొ, షావోమీ 12 అల్ట్రా, షావోమీ 12 లైట్, షావోమీ 12 లైట్ జూమ్ వంటి ఆరు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి రానున్నాయి. టెక్ రిపోర్టుల ప్రకారం.. వాటి స్పెసిఫికేషన్లు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.12ప్రొలో ఫాస్ట్ చార్జ్ టెక్నాలజీ ఉంది. 13 ఓఎస్ తో రన్ కానుంది. ఎంఐయూఐ 12 వెర్షన్ సాఫ్ట్వేర్ అప్డేట్తో వస్తోంది. 6.7 ఇంచ్ స్క్రీన్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. షావోమీ 12 ప్రొ ఆక్టా-కోర్ శ్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇక షియోమి 12 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాలు అధికంగా ఉండటంతో పాటు ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో ఎంతో ఆకట్టుకునేలా ఉంది.