
షావోమీ బ్రాండ్ బ్లాక్ షార్క్ ‘బ్లాక్ షార్క్ 2’ ఫోన్ ను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. 12 జీబీ ర్యామ్, క్వాల్‌కామ్ 855 ప్రాసెసర్ ఈఫోన్ ప్రత్యేకతలు. దీనిని వచ్చే నెలనాలుగో తేదీ నుంచి విక్రయిస్తారు. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.40 వేలు కాగా,12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.50 వేలు. 6.39 ఇంచుల స్క్రీన్,వెనుక రెండు కెమెరాలు, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.