స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Xiaomi.. కార్లు తయారు చేస్తోంది.. ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదిగో..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీసంస్థ Xiaomi..ఇప్పుడు కార్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. షియోమీ సంస్థ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. XiaomiSu7, XiaomiSu7 Max అని పిలువబడే ఈ కార్లు, స్మార్ట్ ఫోన్ల తర్వాత కార్ల తయారీ రంగంలో Xiaomi కంపెనీ అడుగుపెడుతున్న విషయాన్ని తెలియజే స్తున్నాయి. 

XiaomiSu7, XiaomiSu7 Max కార్ల హైలైట్స్ : 

XiaomiSu7 Max కారు కేవలం 2.78 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగం అందుకోగల కెపాసిటీని కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 365 కి.మీల వరకు జూమ్ చేయగలదు. అదే XiaomiSu7కారు అయితే కొంచెం ఎక్కువ సమయం తీసుకుని 5.28 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని పుంజుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కి.మీ  వరకు జూమ్ చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. 

Xiaomi సంస్థ ఇకపై స్మార్ట్ ఫోన్ల తయారీలోనే కాదు..కార్లలో కూడా ఉత్పత్తుల్లో ముందుంటామని తెలిపింది. మానవ జీవితాలను కార్లు, ఇళ్లను కలిపే స్మార్ట్ సిస్టమ్ ను రూపొందిస్తున్నామని కంపెనీ తెలిపింది. Xiaomi SU7 స్మార్ట్ ఫోన్ పరిశ్రమ నుంచి ఆటోమోటివ్ రంగానికి విస్తరిస్తున్నందున హ్యూమన్xకారుxహో మ్ స్మార్ట్ ఎకో సిస్టమ్ ను పూర్తి చేయడంతో గణనీయమైన పురోగతిని సాధించామని కంపెనీ Xలో పోస్ట్ చేసింది. 

Xiaomi  కొత్త EV కార్లను మూడు రంగుల్లో పొందవచ్చు. ఆక్వా బ్లూ, మినరల్ గ్రే, వెర్డాంట్ గ్రీన్. Xiaomi ఈ కార్లలో Eమోటార్స్, బ్యాటరీ, హైపర్ కాస్టింగ్, అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ క్యాబిన్ టెక్నాలజీని వినియోగిస్తుంది. 

ధర, ఉత్పత్తి 

కంపెనీ ఖచ్చితమైన ధర వెల్లడించనప్పటికీ Xiaomi SU7 ధర రూ. 2లక్షలు నుంచి 3 లక్షల యువాన్లు అంటే సుమారు రూ. 25 లక్షల నుంచి 35 లక్షల మధ్య ఉండొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. 2024లో ఈ కార్లు మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం 2 లక్షల కార్లను తయారు చేయగల బీజింగ్ లోని ఓ ఫ్యాక్టరీలో చైనా యాజమాన్యంలోని కార్ కంపెనీ అయిన BAIC గ్రూప్ లో భాగంగా వీటిని తయారు చేస్తున్నారు.