డెలివరీ బాయ్ అవతారం ఎత్తిన షావోమి ఎండీ

డెలివరీ బాయ్ అవతారం ఎత్తిన షావోమి ఎండీ

స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి ఎండీ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. 2020నాటికి  దేశ వ్యాప్తంగా 10వేల స్టోర్లను ఏర్పాటు చేయాలని రెడ్ మీ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే 6వేల స్టోర్లను ఏర్పాటు చేసిన రెడ్ మీ..ఆ సంఖ్యను పెంచేందుకు పబ్లిక్ పల్స్ ను డైరక్ట్ గా పట్టేస్తుంది. ఇందుకోసం ఆ సంస్థ ఎండీ కష్టమర్లకు స్వయంగా ఫోన్లను అందిస్తున్నారు.

మార్కెట్ లో విడుదలవుతున్న షావోమి సంస్థ కు చెందిన సెల్ ఫోన్ ను ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఎండీ మనుకుమార్ జైన్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు.

యుగంధర్ రెడ్డి  షావోమి కి చెందిన రెడ్ మీ నోట్ 8 ప్రో ను ఆర్డర్ చేశారు. ఆ ఆర్డర్  ను కుమార్ జైన్ సదరు కష్టమర్ కి అందించారు. సంస్థ నుంచి విడుదలైన కొత్త ఫోన్లను కష్టమర్లకు తానే స్వయం అందించి.. కష్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిపారు.

షావోమికి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా దేశ వ్యాప్తంగా రెడ్ మీ స్టోర్ల సంఖ్యను పెంచేలా ప్లాన్ చేస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.