న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి లాభం ఇండియాలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో 77 శాతం పడిపోయింది. 2021–22 లో రూ.1,055.7 కోట్ల లాభాన్ని ప్రకటించిన ఈ కంపెనీ, 2022–23 లో కేవలం రూ.238.63 కోట్లు మాత్రమే సాధించింది. ఇదే టైమ్‌లో షావోమి ఇండియా రెవెన్యూ రూ. 39,100 కోట్ల నుంచి 32 శాతం తగ్గి రూ. 26,697 కోట్లకు పడింది. 2022–23 లో షావోమి ఇండియా ప్రొడక్ట్‌ల అమ్మకాలతో రూ.26,395 కోట్ల రెవెన్యూ, సర్వీస్‌ల (వాల్యూ యాడెడ్ సర్వీస్‌లు వంటివి) ద్వారా రూ.264 కోట్ల రెవెన్యూ సాధించింది.
కంపెనీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 2022–2023 లో లో 25 శాతం మేర పడ్డాయి. అయినప్పటికీ షావోమి టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఒకటిగా కొనసాగుతోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి షావోమికి 18.6 శాతం వాటా ఉంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ఈ కంపెనీకి 18.8 శాతం వాటా ఉందని చెబుతుండగా, ఐడీసీ 13 శాతం వాటా ఉందని వెల్లడించింది. షావోమి ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసి 10 ఏళ్లు పూర్తయ్యింది. రానున్న పదేళ్లలో 70 కోట్ల డివైజ్‌లను అమ్మాలని టార్గెట్ పెట్టుకుంది. గత పదేళ్లలో 35 కోట్ల డివైజ్‌లను అమ్మింది.