రూ.5,551 కోట్ల నిధులను సీజ్ చేసిన ఈడీ

రూ.5,551 కోట్ల నిధులను సీజ్ చేసిన ఈడీ

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షావోమీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.5,551 కోట్ల నిధులను  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సీజ్ చేసింది .ఫెమా(ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ) నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంది. షావోమీ సహా విదేశాల్లోని మూడు కంపెనీలకు ఆ సంస్థ భారత విభాగం రాయల్టీ ముసుగులో ఈ డబ్బును చెల్లించినట్లు ఈడీ నిర్ధారించింది. ఈడీ చ‌రిత్రలో ఒక హ‌వాలా లావాదేవీల కేసులో భారీ మొత్తంలో నిధులు జ‌ప్తు చేయ‌డం ఇదే తొలిసారి.

చైనాకు చెందిన షావోమీ గ్రూప్  అనుబంధ సంస్థ అయిన షావోమీ ఇండియా భారత్ లో 2014 నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అయితే ఆ మరుసటి ఏడాది నుంచే ఈ కంపెనీ అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఆ సంస్థకు చెందిన డిపాజిట్లు జప్తు చేసేందుకు ఏప్రిల్ 29న ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది.