హైదరాబాద్, వెలుగు:పారిశ్రామికవేత్త రామ్‌దేవ్‌రావు హైదరాబాద్‌లోని చిలుకూరులో నిర్మించిన ఎక్స్పీరియమ్ఎకో ఫ్రెండ్లీ పార్క్మొదలయింది. ప్రకృతి అందాలను, వినోదాలను ఇష్టపడే వారికి ఎంతో నచ్చుతుందని సంస్థ తెలిపింది.
ఈ పార్క్‌ను150 ఎకరాల్లో నిర్మించారు. 25 వేల మొక్కలు, చెట్లు, కోట్లాది రూపాయల విలువ చేసే శిల్పాలు, రూ.లక్షల విలువ చేసే అరుదైన రాళ్లు దీని ప్రత్యేకతలు. హంపీ థియేటర్, నేచురల్రిసార్ట్ ఐలాండ్, వెడ్డింగ్షూటింగ్ స్పాట్స్, పబ్, డ్రైవ్ఇన్ఎల్ఈడీ థియేటర్, అక్వేరియమ్ రెస్టారెంట్, స్నో పార్క్, కన్వెన్షన్ సెంటర్ వంటి ఆకర్షణలు ఉన్నాయి.