సంస్కారవంతమైన సోప్ ట్రిఫుల్ ఎక్స్ అధినేత ఇక లేరు.. ఆయన ఆస్తి ఎంతో తెలుసా..?

సంస్కారవంతమైన సోప్ ట్రిఫుల్ ఎక్స్ అధినేత ఇక లేరు.. ఆయన ఆస్తి ఎంతో తెలుసా..?

గుంటూరు: ప్రముఖ వ్యాపారవేత్త, భారతీ సోప్ వర్క్స్ ఫ్యాక్టరీ అధినేత అరుణాచలం మాణిక్యవేల్ (77) గురువారం సాయంత్రం అనారోగ్యంతో గుంటూరులోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కన్నుమూశారు. 1947లో ట్యూటికోరన్లో మాణిక్యవేల్ జన్మించారు. కాల క్రమేణా గుంటూరు నగరానికి వెళ్లి స్థిరపడ్డారు. నాలుగు దశాబ్దాలుగా ట్రిఫుల్ ఎక్స్ సోప్ బ్రాండ్ను ఊరూరా మారుమోగేలా చేసి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. సేవా రత్నగా, విద్యాదాతగా మాణిక్యవేల్ సేవలందించారు. ట్రిఫుల్ ఎక్స్ సోప్స్ అధినేతగానే కాకుండా గొప్ప మానవతా వాదిగా ఎంతోమందికి ఆయన ఉపాధి కల్పించారు.

మాణిక్యవేల్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. మాణిక్యవేల్ జీవితంలో ఎదిగిన తీరు భావితరాలకు స్ఫూర్తిదాయకం. 1980లో గుంటూరు నగరానికి వెళ్లిన మాణిక్యవేల్ సబ్బుల వ్యాపారం మొదలుపెట్టారు. స్వయంగా తానే సబ్బులను తయారుచేసి రిక్షాలో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి అమ్మేవారు. అలా మాణిక్యవేల్ వ్యాపార ప్రస్థానం మొదలైంది.

తమిళుడే అయినప్పటికీ తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ‘‘ట్రిఫుల్ ఎక్స్.. సంస్కారవంతమైన సోప్’’ లాంటి స్లోగన్స్ తో తన సోప్ బ్రాండ్ను జనానికి చేరువ చేశారు. 250 రూపాయల డబ్బును జేబులో పెట్టుకుని గుంటూరుకు వచ్చిన మాణిక్వేల్ అరుణాచలం కోట్ల రూపాయల టర్నోవర్ చేసే రేంజ్ కు సోప్ బిజినెస్లో ఎదిగారు. 

Also Reda:-యూట్యూబ్ లో చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్న చివరికి..

2 వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన అరుణాచలం మాణిక్ వేల్ మరణం తీరని లోటు అని చెప్పక తప్పదు. ట్రిఫుల్ ఎక్స్ సోప్స్ కంపెనీకి మాణిక్ వేల్ భార్య మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన కొడుకు పర్వీన్ మాణిక్ వేల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సోప్ బిజినెస్లో అరుణాచలం మాణిక్ వేల్ వందల కోట్లు సంపాదించారు. స్వశక్తితో వందల కోట్ల ఆస్తిని కూడబెట్టారు.