ధన్వాడ, వెలుగు: పీఏసీఎస్‌ల పరిధిలోని దీర్ఘకాలిక రుణాలకు డీసీసీబీ 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ వై వెంకట్రామరెడ్డి తెలిపారు. శుక్రవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో 30 నుంచి 35 శాతం వడ్డీ రాయితీ ఉండేదని, దీనిని ఈసారి 50 శాతానికి పెంచారని చెప్పారు. నెలాఖరులోగా దీర్ఘకాలిక రుణాలు చెల్లించి రాయితీ పొందాలని కోరారు. రుణాలు చెల్లించని పక్షంలో రికవరీ కోసం తాకట్టు పెట్టిన భూమిని వేలం వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మరికల్ మండలంలోని రెండెకరాల స్థలంలో గోదాం నిర్మించాలని, ధన్వాడలో కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సమక్షంలో ఈ విషయంపై తీర్మానం చేస్తామని చెప్పారు. సీఈవో వెంకట్రాములు, డైరెక్టర్లు జగన్నాథ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజు, భాస్కర్ రెడ్డి, భాగ్యమ్మ, రేవతి పాల్గొన్నారు.