యాదాద్రి, వెలుగు : ధరణి అప్లికేషన్లపై స్పెషల్‌డ్రైవ్ చేపట్టి పరిష్కరిస్తామని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ధరణిలోని 11 మ్యాడ్యూల్స్కు సంబంధించిన 7,800 అప్లికేషన్లను పరిశీలించి పరిష్కరించామని, మరో 4,700 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
ఇందులో తహసీల్దార్ల వద్దే 1,733 పెండింగ్ లో ఉన్నాయన్నారు. వీటిని తహసీల్దార్లు పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే తహసీల్దార్లపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.