కంపుకొడుతున్న యాదాద్రి పరిసరాలు

యాదగిరిగుట్ట: శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న యాదగిరి కొండపైన ఆలయ పరిసరాలు దుర్గంధంగా మారాయి.  ఈవో ఆఫీస్ నుంచి బస్ బే వరకు ఉన్న సెల్లార్ ప్రాంతం మొత్తం కంపు కొడుతోంది.  వాడుకలో‌ లేని సెల్లార్ ఏరియాలో స్థానికులు కాలకృత్యాలు తీర్చుకోవడంతో   పరిసరాలు మొత్తం కంపు వాసన కొడుతున్నాయి. 

ముక్కు మూసుకుంటే తప్ప సెల్లార్ ప్రాంతంలో తిరగలేని పరిస్థితులు దాపురించాయి.  ఇకనైనా ఆలయ ఆఫీసర్లు  ఆలయ  పరిశుభ్రతపై  దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.