యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని బహదూర్ పేటలోని ప్రభుత్వ భూమిలో అక్రమ ఇంటి నిర్మాణాలను రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పోలీస్ బందోబస్తుతో కూల్చివేశారు. దీంతో బాధితులకు పోలీస్ లకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నకిలీ పట్టాలతో బాధితులు ఇళ్ల నిర్మాణం చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
ALSO READ :- Congress 5 Lok Sabha Promises: అధికారంలోకి రాగానే.. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం:రాహుల్ గాంధీ
తహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి రికార్డు లేకపోవడంతో రెవిన్యూ సిబ్బంది కూల్చివేతలు చేశామని పేర్కొన్నారు. కూల్చివేత చేస్తున్న మున్సిపల్ సిబ్బందిపై మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య బెదిరింపులకు దిగారు. మున్సిపల్ సిబ్బందికి ఇక్కడేం పని, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ మున్సిపల్ చైర్మన్ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ గొడవ తీవ్ర వివాదానికి దారి తీసింది.