తాగుబోతు వీరంగం.. విద్యార్థుల మెడపై బ్లేడ్ తో..

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ తాగుబోతు -రెచ్చిపోయాడు. విద్యార్థులపై దాడికి దిగి రచ్చ రచ్చ చేశారు. భువనగిరి పట్టణంలో హౌసింగ్ బోర్డులో మునీర్ అనే వ్యక్తి గంజాయి మైకంలో ఇద్దరు విద్యార్థుల మెడలపై బ్లేడ్ తో గాయాలు చేశాడు. దీంతో గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

సమాచారం అందుకున్న భువనగిరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మునీర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.