యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు వేసిన కుట్లు విడిపోయాయి. వారం క్రితం ఆస్పత్రిలో 8 మంది మహిళలకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం వారికి కుట్లు వేసి ఇళ్లకు పంపారు. అయితే ఆపరేషన్ సమయంలో వేసిన కుట్లు విడిపోయాయి. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి అయితే కుట్లు వేసిన చోట ఇన్ఫెక్షన్ కూడా రావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వైద్య సేవలు అందిస్తే.. సామాన్య రోగుల పరిస్థితి ఏంటని? ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవికూడా చదవండి:
తెలంగాణలో 8కి చేరిన ఒమిక్రాన్ కేసులు
పోచవరం నుంచి పాపికొండల టూర్ ప్రారంభం