![పొద్దున్నే కలెక్టర్ తలుపు కొట్టాడు.. ఎందుకంటే..](https://static.v6velugu.com/uploads/2025/02/yadadri-bhuvanagri-collector-visit-10th-class-student-house-early-morning_ac5hxNPdvs.jpg)
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థులను చైతన్యపర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకణల గూడెం పదోతరగతి విద్యార్థి ఇంటికి కలెక్టర్ హనుమంతరావు ఉదయం 5 గంటలకు వెళ్లి తలుపు కొట్టారు. అనంతరం భరత్ చంద్ర అంటూ పిలుస్తూ..నేను జిల్లా కలెక్టర్‌ను వచ్చా నంటూ ఆ విద్యార్థి చదువు విషయం గురించి ఆరాతీశాడు. పదో తరగతి విద్యార్థికి మైలురాయి అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఆ విద్యార్థి చదువుకునేందుకు వీలుగా.. ఒక చైర్, రైటింగ్ పాడ్ గిఫ్ట్ గా ఇచ్చారు.
Also Read :- స్థిరంగా బంగారం ధరలు..ఇవాళ (ఫిబ్రవరి6) ఎంతంటే
అనంతరం విద్యార్థి తల్లి దండ్రులతో ముచ్చటించి.. ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీసిన కలెక్టర్ పదో తరగతి పరీక్షలు అయ్యేంత వరకు ప్రతి నెల రూ. 5 వేలు ఆర్థిక సాయం చేస్తానని ఫిబ్రవరి నెల సాయాన్ని అందించారు. కలెక్టర్ మాటలతో తనకు ఆత్మ విశ్వాసం పెరిగిందని... బాగా చదివి పోలీస్ ఆఫీసర్ అవుతానని ధీమాగా విద్యార్థి భరత్ చంద్ర కలెక్టర్‌కు తెలిపాడు. కలెక్టర్ స్వయంగా ఇంటికి రావటం నమ్మలేక పోతున్నామంటూ విద్యార్థి కుటుంబ సభ్యుల ఆనందం వ్యక్తం చేశారు.