మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి : హనుమంతరావు

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి : హనుమంతరావు
  • కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు : మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, ఇంకా రాణించాల్సిన అవసరం ఉందని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడాపోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాలతోపాటు క్రీడల్లో కూడా పాల్గొని రాణించాలని సూచించారు.

పనుల పురోగతిపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్..

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ హనుమంతరావు సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, నర్సరీ, ప్లాంటేషన్ సర్వైవల్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. సమ్మర్ దృష్ట్యా నర్సరీల్లో మొక్కల సంరక్షణ, నీడ కోసం నెట్ షెడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

రోడ్డుకు ఇరువైపులా మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు ఎక్కువ సంఖ్యలో కూలీలు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, గంగాధర్, జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ధనంజనేయులు, జడ్పీ సీఈవో శోభారాణి, యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.