యాదాద్రి, వెలుగు : అన్ని ప్రయత్నాలు చేసినా స్టూడెంట్ప్రశాంత్ను కాపాడుకోలేకపోయామని యాదాద్రి కలెక్టర్ హనుమంతు జెండగే తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఈనెల 11న అస్వస్థతకు గురైనప్పటి నుంచి వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్, మిరకిల్ హాస్పిటల్లో తుర్కపల్లి తహసీల్దార్, ఉస్మానియా హాస్పిటల్, బంజారాహిల్స్ రెయిన్ బో హాస్పిటల్స్ లో పోచంపల్లి తహసీల్దార్, భువనగిరి ఏరియా ఆస్పత్రిలో భువనగిరి తహసీల్దార్లను పర్యవేక్షకులుగా నియమించినట్లు తెలిపారు.
రెయిన్ బో హాస్పిటల్ లో స్టూడెంట్ ప్రశాంత్ కోసం ప్రత్యేకంగా చౌటుప్పల్ ఆర్డీవోను నియమించామని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకొని మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇతర అనారోగ్య కారణాలతో ప్రశాంత్చనిపోయారని తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్శ్రీరామ్శ్రీనివాస్ను సస్పెండ్ చేశామని చెప్పారు. గురుకులంలోని వాటర్, కూరగాయల శాంపిల్స్‌ను టెస్ట్‌ల కోసం పంపించామని వివరించారు.