ఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు

చండూరు (నాంపల్లి), వెలుగు : పారదర్శక పాలన అందించిన టీడీపీనే ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లిలో టీడీపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొందరి ప్రయోజనాల కోసమే పాలన సాగిస్తున్నారన్నారు. తెలంగాణలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, రాజకీయాలు కలుషితం అయ్యాయని ఆరోపించారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణలో టీడీపీ కీలకపాత్ర వహిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి మక్కెన అప్పారావు, పెద్దిరెడ్డి శేషారెడ్డి, మొగుదాల పార్వతమ్మ, పగడాల లింగయ్య, వజ్జ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, దానబోయిన నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

‘డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఇండ్లకు అప్లై చేసుకోండి

యాదాద్రి, వెలుగు : భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోచంపల్లి, మోటకొండూరులో నిర్మించిన డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్ల కోసం అప్లై చేసుకోవాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. పోచంపల్లిలో 120, మోటకొండూరులో 40 డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లు ఉన్నట్లు చెప్పారు. అర్హులైన వారు ఈ నెల 27నాటికి మీ – సేవ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.

టీటీడీ కల్యాణమండపం ప్రారంభం

దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని తాటికోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోడ్డు వద్ద నిర్మించిన టీటీడీ కల్యాణమండపాన్ని ఆదివారం శాసనమండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా కల్యాణమండపం నిర్మించడం అభినందనీయం అన్నారు. ఈ మండపాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలంపల్లి నర్సింహ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వడ్త్య దేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిర్వాహకుడు జగతయ్య పాల్గొన్నారు. 

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి/నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృ-షి చేస్తామని నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాలలోని 1వ వార్డులో  పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాల్వలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పనిచేసే నాయకులకే ప్రజలు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీపీ కొలను సునీత వెంకటేశంగౌడ్, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడల ఆదిమల్లయ్య, జడ్పీటీసీ ధనమ్మ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింగస్వామి, మండల అధ్యక్షుడు ఐలయ్య, పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య పాల్గొన్నారు. అలాగే నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అయ్యప్ప ఆలయంలో జరిగిన మహాపడిపూజ, మండల పూజా మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం కోసం రూ.1,00,116 అందజేశారు. 

హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ల నిర్మాణానికి నిధులు మంజూరు 

నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో 7 హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెళ్లంల, అమ్మనబోలు, షాపల్లి, ఏపీ.లింగోటం, కేతేపల్లి మండలం గుడివాడ, కొప్పోలు, భీమారం గ్రామాల్లో సబ్ సెంటర్లకు రూ.20 లక్షల చొప్పున మంజూరైనట్లు తెలిపారు.

ఉచిత వైద్యం అందించడం అభినందనీయం

మునగాల (మోతె), వెలుగు : పేదలకు ఉచిత వైద్యం అందించడం అభినందనీయమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హెల్తిఫై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహకారంతో ఆదివారం సూర్యాపేట జిల్లా రావిపహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రజలందరికీ విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మోతె జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, హెల్తీఫై హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మతకాల చలపతిరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు  ములకలపల్లి రాములు, సర్పంచ్ కోటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీటీసీ సండ్ర పద్మ మధు పాల్గొన్నారు. అనంతరం కోదాడలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో రైతులందరికీ వయసుతో సంబంధం లేకుండా రైతుబీమా వర్తింపజేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, జుట్టుకొండ బసవయ్య, కోట గోపి, ములకలపల్లి రాములు, ఎం.ముత్యాలు, ఏనుగుల వీరాంజనేయులు పాల్గొన్నారు.

గ్రామాలకు నిధులివ్వకుంటే రాజీనామా చేస్తాం

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : గ్రామ పంచాయతీలకు ఐదు నెలల నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని, లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు హెచ్చరించారు. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాలకు నిధులు విడుదల చేయకపోవడంతో కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులు కట్టడానికి, ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు సరైన టైంలో స్పందించడం లేదని, గ్రామాలకు అవసరమైన విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్తంభాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో పంచాయతీ మోటార్లు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సి వస్తోందన్నారు. దీని వల్ల కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లు భారీగా వస్తోందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ ఉప్పు భద్రయ్య పాల్గొన్నారు.

అయ్యప్ప ఆలయానికి రూ. లక్ష విరాళం

నకిరేకల్, వెలుగు : నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో అయ్యప్ప ఆలయంలో ఆదివారం నిర్వహించిన మహాపడిపూజకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కొండేటి మల్లయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప ఆలయ నిర్మాణానికి రూ. లక్ష విరాళం అందజేశారు. కార్యక్రమంలో యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండా జలంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మాజీ ఎంపీపీ లింగాల మల్లీశ్వరి వెంకన్న, మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, కేతపల్లి మండల మాజీ జడ్పీటీసీ జటంగి వెంకట నరసయ్య పాల్గొన్నారు.

ఏపీ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసిన ఎమ్మెల్యే భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండకు వచ్చిన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ్మినేని సీతారాంను ఆదివారం నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కలిశారు. పట్టణంలోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఆయన వెంట నల్గొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, పూజిత శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

మృతురాలి ఫ్యామిలీని పరామర్శించిన ఎర్రబెల్లి

చండూరు (మర్రిగూడ), వెలుగు : నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తాందారిపల్లికి చెందిన టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర నాయకులు మునగాల నారాయణరావు తల్లి సరోజనమ్మ ఇటీవల చనిపోయారు. ఆదివారం నిర్వహించిన దశదినకర్మకు పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు హాజరై నారాయణరావును పరామర్శించారు. అనంతరం సరోజనమ్మ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. 

ఆర్టీసీ కార్గో సేవలను గ్రామాలకూ విస్తరిస్తాం

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఆర్టీసీ కార్గో సేవలను గ్రామాలకు సైతం విస్తరిస్తామని స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి.సంతోశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండలోని ఆర్టీసీ కార్గో విభాగాలను పరిశీలించి మాట్లాడారు. కొత్త, కొత్త ఆలోచనలు, బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. నల్గొండ పరిధిలోని 7 డిపోలలో 36 మంది ఏజెంట్లు, 8 పాయింట్లతో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2022 నుంచి నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2022 వరకు రూ.2.62 కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం వచ్చినట్లు చెప్పారు.