యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు

యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రవణమాసం.. ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శినానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 2 గంటల సమయం డుతుండగా, ఉచిత దర్శానానికి 4 గంటల సమయం పడుతోంది. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు నిర్వహించారు. 

కొండపైన ఉన్న కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతున్నది. కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడ భక్తులు సందర్శించి.. ఆలయ నిత్యపూజలలో పాల్గొని శ్రీవారి దర్శించుకున్నారు.

ఖుషి మూవీ సక్సెస్ కావడంతో.. ఇవాళ(సెప్టెంబర్ 03) లక్ష్మీ నారసింహుని మూవీ టీమ్ దర్శించుకోనున్నారు. హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండ సహా పలువురు స్వామివారి సేవలో పాల్గొననున్నాట్టు తెలుస్తోంది. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయని టాక్. 

ఇక విజయ్ గత చిత్రం లైగర్, సమంత గత చిత్రం శాకుంతలం ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అందుకే ఈ ఇద్దరి కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. ఈ క్రమంలో వచ్చిన సినిమానే ఖుషి. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ తో పాటు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. 

వేములవాడకు పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం, ఆదివారం సెలవు రోజు(సెప్టెంబర్ 03) కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కోడె మొక్కుల కోసం భక్తులు క్యూ కట్టారు.  స్వామి వారి ప్రసాదం కౌంటర్స్, కళ్యాణ కట్ట భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

వేములవాడలో వర్షం భారీగా కురుస్తున్నడంతో ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది.