యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి స్పెషల్ దర్శనానికి ఒక గంట సమయం పడుతుండగా.. ఉచిత దర్శనం ఒక గంట 30 నిమిషాల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ALSO READ: గణేష్ చతుర్థి : అతిథులను ఆకట్టుకునే బెస్ట్ ఇండియన్ ఐటెమ్స్
స్వామివారి నిత్యపూజల్లో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. కొండపైన కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులు దర్శించుకున్నారు. కొండ కిందగల అనుబంధ ఆలయమైన శ్రీపాత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.