యాదాద్రి, వెలుగు: అప్పుడే పుట్టిన శిశువును ముళ్ల పొదల్లో విసిరేసిన ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగింది. ఈ శిశువును కుక్కలు పీక్కుతింటుండగా స్థానికులు గమనించి వాటిని వెల్లగొట్టారు. కానీ, అప్పటికే శిశువు చనిపోయింది. భువనగిరిలోని ఏరియా హాస్పిటల్ దగ్గరలోని ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు.
కుక్కలు శిశువును గాయపరిచాయి. గమనించిన ఒక మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, హెల్త్ స్టాఫ్ చేరుకొని శిశువు మృతదేహాన్ని హాస్పిటల్కు తరలించారు. స్థానిక కౌన్సిలర్ ఊదరి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.