భువనగిరి సబ్ ​జైలును సందర్శించిన జడ్జి

యాదాద్రి, వెలుగు : జైలులో ఉన్న ఖైదీలకు కల్పించిన వసతులు, సౌకర్యాలపై యాదాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజు ఆరా తీశారు. భువనగిరిలోని సబ్​ జైలును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జైలులో ఆయన పర్యటించారు. జైలులోని స్థితిగతులు

ఖైదీలకు ఎలాంటి వసతులు కల్పించారని జైలు పర్యవేక్షణాధికారి పూర్ణ చందర్​ను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందిస్తున్న న్యాయ సహాయం గురించి రివ్యూ నిర్వహించి, తగు సూచనలు చేశారు. ఆయనవెంట ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి వీ.మాధవిలత ఉన్నారు.