బేటీ బచావో.. బేటీ పడావోపై అవగాహన కల్పించాలి

యాదాద్రి, వెలుగు : గిరిజన తండాల్లో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ గంగాధర్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిశోర బాలికలు, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు, కొత్తగా పెళ్లి అయిన మహిళలకు బేటీ పడావో.. బేటీ బచావో పై అవగాహన కల్పించాలన్నారు. 

బడికి వెళ్లని పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ బండారు జయశ్రీ, సభ్యులు పి.రుద్రమదేవి , శివరాజు, మల్లేశం,  డీఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ వో యశోద, ఉపాధి కల్పన అధికారి పీడీ సాహితి, జిల్లా క్రీడల యువజన అధికారి ధనుంజయ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.