ఏసీబీ వలలో యాదాద్రి డీటీవో

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా డిస్ట్రిక్​ ట్రాన్స్​పోర్ట్​ ఆఫీసర్​ వై సురేందర్​ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయన తరపున పని చేస్తున్న ఏజెంట్లు కూడా ఇందులో భాగస్వాములు కావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ నల్గొండ డీఎస్పీ శ్రీనివాసరావు కథనం ప్రకారం...జిల్లాలోని భూదాన్​ పోచంపల్లి మండలం కప్రాయిపల్లికి చెందిన ప్రవీణ్​కుమార్​ తన వెహికల్​నేషనల్​పర్మిట్​క్యాన్సిల్ ​చేయడం కోసం స్లాట్​బుక్​ చేసుకున్నాడు. అందులో భాగంగా ఈ నెల 2న 
భువనగిరిలోని ఆర్టీవో ఆఫీసుకు వెళ్లారు. తమకు రూ. 12 వేలు ఇస్తేనే పర్మిట్ ​క్యాన్సిల్ ​చేస్తామని డీటీవో సురేందర్​రెడ్డి, ఆయన పర్సనల్ అసిస్టెంట్​మల్లికార్జున్​ స్పష్టం చేశారు.

కొద్దిరోజులు ఆగి మళ్లీ ఆర్టీవో ఆఫీసుకు వెళ్లగా డీటీవో సురేందర్​ రెడ్డి రూ.5 వేలకు ఒక్క పైసా తగ్గేది లేదని చెప్పాడు. దీంతో ప్రవీణ్​నల్గొండ ఏసీబీ అధికారులను కలిశాడు. వారి సూచనల మేరకు శుక్రవారం ప్రవీణ్​ డబ్బులతో ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి మల్లికార్జున్​ను కలిశాడు. అతడు చెప్పిన ప్రకారం డబ్బులను ఏజెంట్ సురేశ్​కు ఇచ్చాడు. సురేశ్​ఆ డబ్బులను మరో ఏజెంట్​అనిల్​తో కలిసి డీటీవో సురేందర్​రెడ్డికి ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ పట్టుకుంది.

రూ. 29 వేలను స్వాధీనం చేసుకొని డీటీవో సురేందర్​రెడ్డి, ఏజెంట్లు సురేశ్​, అనిల్​ను అదుపులోకి తీసుకున్నారు. మల్లికార్జున్​ పరారీలో ఉన్నాడని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్​లోని సురేందర్​రెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. డీటీవో, ఏజెంట్లను హైదరాబాద్​లోని ఎస్పీఈ, ఏసీబీ స్పెషల్​జడ్జి ఎదుట హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్​ చేస్తే తమ టోల్​ ఫ్రీ నెంబర్​ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు.