యాదాద్రి, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ట్రిపుల్ ఆర్ భూసేకరణపై రైతులతో యాదాద్రి జిల్లా ఆఫీసర్లు చర్చలు ప్రారంభించారు. జిల్లాలోని ఐదు మండలాలు, 24 గ్రామాలపై 59 కిలోమీటర్ల ట్రిపుల్ఆర్ నిర్మాణం కానున్న సంగతి తెలిసిందే. తుర్కపల్లి మండలం కూనాపురం రైతులతో శనివారం యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సమావేశం ఏర్పాటు చేశారు.
భువనగిరి ఆర్డీవో ఆఫీసులో జరిగిన ఈ సమావేశానానికి హాజరైన కూనపురం రైతులు బహిరంగ మార్కెట్ ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని, కనీసం ఎకరానికి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్చేశారు. అయితే ఆఫీసర్లు ముందు రూ.22 లక్షలు ఇస్తామని ఆఫీసర్లు చెప్పారు. అయినప్పటికీ ఒప్పుకోకపోవడంతో చివరకు రూ.30 లక్షలు ఇప్పిస్తామని తెలిపారు.