ఇంటర్​ ఫలితాల్లో బాలికలదే పైచేయి .. యాదాద్రి జిల్లాకి 14వ స్థానం

ఇంటర్​ ఫలితాల్లో బాలికలదే పైచేయి .. యాదాద్రి జిల్లాకి 14వ స్థానం
  • ఇంటర్​ ఫలితాల్లో స్టేట్​లో యాదాద్రి 14వ స్థానం
  • నల్గొండ ఫస్టియర్ లో 16, సెకండియర్ లో 19  
  • సూర్యాపేట ఫస్టియర్ లో 26, సెకండియర్ లో 24
  • సర్వేల్ స్టూడెంట్స్ టాప్​
  • ఇంటర్ సెకండియర్​లో వంద శాతం పాస్​

యాదాద్రి, నల్గొండ, వెలుగు : ఇంటర్​ ఫలితాల్లో యాదాద్రి జిల్లా స్టూడెంట్స్ ప్రతిభ చూపారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చివరి నాలుగైదు స్థానాల్లో నిలిచిన జిల్లా ఈసారి ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో 14వ స్థానంలో నిలిచింది. నల్గొండ ఫస్టియర్​లో 16వ స్థానం, సెకండియర్​లో 19వ స్థానంలో నిలిచింది. సూర్యాపేట ఫస్టియర్​లో 26వ స్థానం, సెకండియర్​లో 24వ స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. యాదాద్రి జిల్లాలోని సర్వేల్​ గురుకులం స్టూడెంట్స్​మంచి మార్కులు సాధించారు.

నల్గొండ జిల్లాలో.. 

ఇంటర్​ ఫస్టియర్​లో11,694 మంది విద్యార్థులకు 6,781 (54.99 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 5,452 మంది బాలురు ఎగ్జామ్​రాయగా, 2,699 (49.50 శాతం) మంది పాస్ అయ్యారు. 6,242 మంది బాలికల్లో 4,082(65.40 శాతం) పాస్ అయ్యారు. ఒకేషనల్‌‌ కోర్సుకు సంబంధించి 2,283 మందికి, 1150  (50.37 శాతం) మంది పాస్ అయ్యారు. సెకండియర్​జనరల్‌‌ విభాగంలో 10,957 మందిలో 7,543 (68.84 శాతం) మంది పాస్​ అయ్యారు. 5006 బాలురులో 3,052(60.97 శాతం) మందిపాస్‌‌ అయ్యారు. 5,991 మంది బాలికల్లో 4,491(75.47 శాతం) మంది పాస్‌‌ అయ్యారు. ఒకేషనల్‌‌ విభాగంలో 2,035 మందికి..1,417 (69.37 శాతం) మంది పాస్ అయ్యారు. 

సూర్యాపేట జిల్లాలో.. 

ఫస్టియర్​లో 6,389 మంది విద్యార్థులకు 3,613 (56.16 శాతం) మంది పాస్ అయ్యారు. వీరిలో 2,878 మంది బాలురలో 1,329 (46.18 శాతం) మంది పాస్ అయ్యారు. 3,511 బాలికల్లో 2,284 (65.05 శాతం) మంది పాస్​అయ్యారు. ఒకేషనల్‌‌ కోర్సులో 1,679 మందికి.. 807 (48.06 శాతం) మంది పాస్​ అయ్యారు. సెకండియర్​లో మొత్తం 6,152  మందిలో 4,133 (67.18 శాతం) మంది పాస్ అయ్యారు. బాలురు 2,801మందికి.. 1,618 (57.77 శాతం) మంది పాస్‌‌ అయ్యారు. బాలికల్లో 3,351 మందికి 2,515  (75.05 శాతం) మంది పాస్‌‌ అయ్యారు. ఒకేషనల్‌‌ విభాగంలో 1,366  మందికి.. 850 (62.23 శాతం) మంది పాస్ అయ్యారు. 

యాదాద్రి జిల్లాలో..

యాదాద్రి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్​లో జనరల్, వొకేషనల్​కలిపి 6,208 మంది ఎగ్జామ్​ రాయగా, 3,634 (58.54 శాతం) మంది స్టూడెంట్స్​పాస్​ అయ్యారు. ఎగ్జామ్ రాసిన 3,217 బాలికల్లో 2,172 (67.52 శాతం) మంది పాసయ్యారు. ఎగ్జామ్ రాసిన 2991 మంది బాలురుల్లో 1,462 మంది (48.88 శాతం) పాస్​ అయ్యారు. సెకండియర్​లో జనరల్, వొకేషనల్ కలిపి 5530 మంది ఎగ్జామ్​రాయగా, 3,756 (67.92 శాతం) మంది పాస్ అయ్యారు. ఎగ్జామ్ రాసిన 2,992 మంది బాలికల్లో 2,319 (77.51 శాతం) మంది పాస్ అయ్యారు. 2,358 మంది బాలురుల్లో 1437 (56.62 శాతం) పాస్​ అయ్యారు.  

బాలికలదే పై చేయి..

ఇంటర్​ ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్​, సెకండియర్ కలిపి 26,488 మంది బాలికలు ఎగ్జామ్​రాయగా, 18,727 మంది పాస్ అయ్యారు. 23,527 మంది బాలురు ఎగ్జామ్ రాయగా, వీరిలో 12,390 మంది పాస్ అయ్యారు. నల్గొండ జిల్లాలో ఫస్టియర్​, సెకండియర్ కలిపి 12,233 బాలికలు ఎగ్జామ్ రాయగా, 8,573(70.01 శాతం) మంది పాస్​అయ్యారు. 10,458 మంది బాలుగు ఎగ్జామ్​రాయగా, 5,751 (55 శాతం )మంది పాస్ అయ్యారు.

 సూర్యాపేట జిల్లాలో ఫస్టియర్, సెకండియర్ కలిపి 8,046 మంది బాలికలు పరీక్ష రాయగా, వారిలో 5,663 మంది (70.04 శాతం) పాస్​అయ్యారు. 7,540 మంది బాలురు రాయగా, 3,740 (49.06 శాతం) మంది పాస్ అయ్యారు. యాదాద్రి జిల్లాలో ఇంటర్​ ఫస్టియర్​, సెకండియర్​లో 6,209 మంది బాలికలు ఎగ్జామ్​రాయగా, 4491 (72.93 శాతం) మంది పాస్ అయ్యారు. 5,529 మంది బాలురు పరీక్ష రాయగా, 2,899 (52.43 శాతం) పాస్ అయ్యారు. యాదాద్రి జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఈ స్థాయిలో ఇంటర్​ ఫలితాలు రావడం ఇదే మొదటిసారి. 2023–-24లో 54.50 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఈసారి మాత్రం 62.96 శాతం మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. 

సర్వేల్ గురుకులం​ టాప్..

యాదాద్రి జిల్లా సంస్థాన్​ నారాయణపురంలోని సర్వేల్ గురుకుల స్టూడెంట్స్​ప్రతిభ చూపారు. సెకండియర్​లో 148 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయగా, వంద శాతం పాస్​అయ్యారు. ఫస్టియర్​లో 162 మందికి 150 మంది పాస్​ అయ్యారు. ఇంటర్ సెకండియర్ ఎంపీసీ​స్టూడెంట్ విజయచారి​1000 మార్కులకు 989 సాధించాడు. బైపీసీ స్టూడెంట్​టి.విక్రమ్ 1000 మార్కులకు 984 మార్కులు, ఎంఈసీ స్టూడెంట్ సూర్య కృష్ణ 1000 మార్కులకు 965 సాధించాడు. ఫస్టియర్​లో ఎంపీసీ స్టూడెంట్​జె.అశోక్​ 470 మార్కులకు 468, బైపీసీ స్టూడెంట్స్​శివప్రసాద్, జగదీశ్​440 మార్కులకు 435 చొప్పున సాధించారు. ఎంఈసీ స్టూడెంట్ డీఎస్ కృష్ణ 500 మార్కులకు 495 సాధించాడు.