
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం భారీ వడగండ్ల వాన కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి, మాదాపురం, ముల్కలపల్లిలో తీవ్ర వడగండ్ల వాన పడింది. భువనగిరి మండలం వీరవెల్లి, బండసోమారం, చందుపట్ట గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి పంటలు పాడయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, కందికట్కూర్, ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. కరీంనగర్ పట్టణంలో, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట, కోహెడ మండలంలో భారీ వర్షం కురిసింది.
శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో వచ్చిన వడగండ్ల వానకు మామిడి కాయలు నేల రాలాయి. చెట్టు కూలిపోయాయి. కోతకు వచ్చిన వరిపంట నాశనం అయ్యింది. రెండు రోజులుగా అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతులం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.