
యాదాద్రి, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో వడ్లు అమ్మి మద్దతు ధర పొందాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ పొందాలని సూచించారు. కలెక్టరేట్లో అగ్రికల్చర్ తదితర శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు లబ్ధి కలిగే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు. అనంతరం మద్దతు ధర, బోనస్ బ్రోచర్, వాల్ పోస్టర్విడుదల చేశారు.
పండుగ వాతావరణంలో ఉత్సవాలు..
పండుగ వాతావరణంలో మహాత్మా జ్యోతిరావుఫూలే జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్టు చేస్తున్నామని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. వివిధ సంఘాల లీడర్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. వేర్వేరుగా నిర్వహించిన మీటింగ్‌ల్లో ఆర్డీవో కృష్ణారెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, డీపీవో సునంద, మార్కెటింగ్ ఆఫీసర్ సబిత, వెల్ఫేర్ ఆఫీసర్లు యాదయ్య, వసంతకుమారి పాల్గొన్నారు.