యాదాద్రిలో రెండో రోజు ప్రత్యేక పూజలు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయలో మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ పర్వాలు కొనసాగుతున్నాయి. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఉదయం 4 గంటలకు బ్రహ్మా ముహూర్తంలో 108 కలశాలతో ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ ఉద్ఘాటన లో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి.. శాంతిపాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన,ద్వారా తోరణ, ధ్వజ కుంభారాధనలు, అగ్నిమధనం, అగ్నిప్రతిష్ఠ, యజ్ఞం ప్రారంభం నిర్వహిస్తున్నారు అర్చకులు.  
విశేష యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, నిత్యలఘు పూర్ణాహుతి జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమాలు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతిహోమం, నవకలశ స్నపనం, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వ హించనున్నారు.
 

 

ఇవి కూడా చదవండి

ఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యుల సస్పెండ్‌

భారత్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు

రాత్రిపూట యువకుడి పరుగుపై స్పందించిన ఆనంద్ మహీంద్రా