యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు రెండోరోజు వైభవంగా జరుగుతున్నాయి. వేదపారాయణాలు, వేదపండితుల మంత్రాల మధ్య నరసింహుడి జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జయంతి ఉత్సవాల్లో ఇవాళ కాళీయమర్థిని అలంకారంలో ఆలయ మాడవీధిలో ఊరేగుతూ స్వామివారు కనువిందు చేశారు. అంతకుముందు స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. లక్ష పుష్పార్చనకు ముందు స్వామివారికి మంగళ నీరాజనం, మంత్ర పుష్పములతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.