సన్నబియ్యంతో పేదలకు మూడుపూటల భోజనం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

సన్నబియ్యంతో పేదలకు మూడుపూటల భోజనం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు : సన్నబియ్యంతో పేదలు మూడు పూటలా కడుపునిండా భోజనం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం రామన్నపేట మండలంలోని దళితవాడలో బుచ్చమ్మ  ఇంటికి అతిథులుగా ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ హనుమంతరావు వెళ్లారు. 

బుచ్చమ్మ తో కలిసి సన్నబియ్యంతో వండిన అన్నం తిన్నారు. అనంతరం బుచ్చమ్మ కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె నిరుపేద మహిళ కావడంతో అప్పటికప్పుడే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే కాక నిర్మాణానికి అయ్యే ఖర్చులకు రూ.50 వేలు అందజేశారు. ఎంపీ రూ.20 వేలు, ఎమ్మెల్యే రూ.20 వేలు, కలెక్టర్ రూ.10 వేలు ఆర్థికంగా సాయం అందించారు. అనంతరం ఆర్థిక సాయం అందజేసిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.