యాదాద్రి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.2.32 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన హుండీలను సోమవారం ఆలయ ఆఫీసర్లు లెక్కించారు. 25 రోజులుగా హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండిని ఎస్పీఎఫ్, హోంగార్డుల భద్రత నడుమ కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపానికి తరలించి కౌంట్​ చేశారు. ఇందులో రూ.2కోట్ల32లక్షల22వేల689 నగదు రాగా.. 230 గ్రాముల బంగారం, 4 కిలోల 420 గ్రాముల వెండి వచ్చిందని ఈఓ రామకృష్ణారావు చెప్పారు.

అలాగే 593 యూఎస్​ డాలర్లు, 65 యూఏఈ దిర్హామ్స్, 65 ఆస్ట్రేలియన్, 220 కెనడా,10 సింగపూర్ డాలర్లు, 10 ఇంగ్లాండ్  పౌండ్స్​, 122 సౌదీ అరేబియా, ఒమన్ 400 రియాల్స్​, 15 యూరోస్ తో పాటు మరికొన్ని దేశాల కరెన్సీ వచ్చినందని ఈఓ చెప్పారు. చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షించారు.