యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 4 నుండి 14 వరకు యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల 10న స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. 11న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవ నిర్వహించారు. ఇక 12వ తేదీన స్వామివారి దివ్య విమానం రథోత్సవం జరగనుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, శ్రీ సుదర్శన నరసింహ హోమము ఆర్జిత సేవలు రద్దు చేశామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈఓ తెలిపారు.
ఇవి కూడా చదవండి: