యాదాద్రి, వెలుగు: నేషనల్ సైన్స్ కాంగ్రెస్కు యాదాద్రి స్టూడెంట్ భూక్యా సలోని ఎంపికయ్యారు. హైదరాబాద్లో జరిగిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ స్టేట్ లెవల్ పోటీలకు తుర్కపల్లి మండలం ముల్కలపల్లి హైస్కూల్ స్టూడెంట్ సలోని హాజరయ్యారు. తాను రూపొందించిన ‘వాడిపడేసిన సిగరెట్ పీకతో కాలుష్యం పీక నొక్కుదాం’ ప్రాజెక్ట్ ప్రదర్శించారు.
ఈ ప్రాజెక్ట్ను ఆసక్తిగా గమనించిన పరిశీలకులు జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. స్టూడెంట్ సలోనిని తెలంగాణ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ మారుపాక నగేశ్, విద్యాశాఖ జేడీ మదన్మోహన్, కలెక్టర్ హనుమంతు జెండగే, అడిషనల్ కలెక్టర్ జీ వీరారెడ్డి, డీఈవో నారాయణ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి భరణి కుమార్, టీచర్ కల్యాణి అభినందించారు.