యాదాద్రి : 24 రోజుల్లోనే.. కోటి 69 లక్షల హుండీ ఆదాయం..

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలో 24 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను శనివారం(అక్టోబర్ 07) లెక్కించారు. 24 రోజుల్లోనే స్వామివారి ఆదాయం కోటి 69 లక్షలుగా చేకూరిందని వెల్లడించారు. ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహించారు. కానుకల్లో రూ:1,69,83,021-00 నగదు రాగా, 147 గ్రాముల బంగారం, 2 కిలోల 500 గ్రాముల వెండి సమకూరినట్లు ఈవో చెప్పారు. 

హుండీలలో విదేశీ కరెన్సీని కూడా భక్తులు సమర్పించారు. అమెరికా 253 డాలర్లు, యూఏఈ 75 దిర్హామ్స్, ఆస్ట్రేలియా 80 డాలర్లు, కెనడా 40 డాలర్లు, మలేసియా 1, ఇంగ్లాండ్ 10, నేపాల్ 110, సౌదీ అరేబియా10, కువైట్ 3, ఇస్రేల్ 20, థాయ్ భట్ 100 కరెన్సీ వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.