యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 5 గంటలు

యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి, స్వామివారి జన్మనక్షత్ర స్వాతి నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ధర్మదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు నిర్వహించారు.