![గవర్నర్ యాదాద్రి పర్యటనకు హాజరుకాని ఈవో](https://static.v6velugu.com/uploads/2022/04/Yadadri-Temple-EO-did-not-attend-Governor-Tamilsai-Soundarajan's-visit_tucPz6Q0oD.jpg)
- ప్రోటో కాల్ పాటించకపోవడంపై విమర్శలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దంపతులకు ప్రోటోకాల్ పాటించకపోవడం చర్చనీయాంశం అయింది. వందల కోట్ల రూపాయలతో ఆధునీకరించిన యాదాద్రి ఆలయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్ తమిళి సై దంపతులకు కేవలం ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
గవర్నర్ తమిళిసై పర్యటనకు ఆలయ ఈవో గీతారెడ్డి గైర్హాజరు అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ప్రొటో కాల్ ప్రకారం గవర్నర్ కు ఆలయ ఈవో స్వాగతం పలకాలి. కానీ ఈవో లేకపోవడంతో ఆలయ ఏఈఓలు స్వాగతం పలికారు. దర్శనం తర్వాత గవర్నర్ దంపతులకు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామివారి లడ్డూప్రసాదం అందజేశారు. అయితే ఈవో గీతారెడ్డి ఇవాళ విధులకు హాజరుకాలేదని చెప్తున్నారు ఆలయ అధికారులు.
ఇవి కూడా చదవండి
సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్
ఛండీఘఢ్ను పంజాబ్కు ఎలా బదిలీ చేస్తారు?
వీడియో: బిజీ రోడ్డులో కారుపై ఎక్కి డాన్సులు
ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి