స్వర్ణ కాంతుల్లో యాదాద్రి విమాన గోపురం... ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు

స్వర్ణ కాంతుల్లో యాదాద్రి విమాన గోపురం... ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు
  • ఈ నెల 19 నుంచి 23 వరకు 'మహాకుంభ సంప్రోక్షణ' మహోత్సవాలు
  • 23న ఉదయం సీఎం రేవంత్ చేతుల మీదుగా కుంభ సంప్రోక్షణ ప్రారంభం
  • మార్చి 1 నుంచి 11 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరి గుట్ట  శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గర్భగుడిపై ఉన్న పంచతల దివ్యవిమాన గోపురానికి స్వర్ణ తాపడ బిగింపు పనులు శనివారంతో పూర్తయ్యాయి. దీంతో 'పంచకుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ' మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి శనివారం ఆలయ ఈవో భాస్కర్ రావు పూర్తి వివరాలు వెల్లడించారు.

ఈనెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు పాంచరాత్ర ఆగమ శాస్త్రం పద్ధతుల్లో 'స్వర్ణ దివ్యవిమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవాలు' జరగనున్నాయి. 19న స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనంతో ఉత్సవాలు ప్రారంభమై.. ఈ నెల 23న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 19 నుంచి 23 వరకు 'పంచకుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగం' చేపట్టనున్నారు.

ఉత్సవాల చివరి రోజైన ఈనెల 23న స్వర్ణమయమైన దివ్యవిమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11:54 గంటలకు మూల నక్షత్రం, వృషభ లగ్నంలో అర్చకులు.. సీఎం రేవంత్ చేతుల మీదుగా స్వర్ణవిమాన గోపురంపై సంప్రోక్షణ పూజలు చేసి బంగారు దివ్యవిమాన గోపురాన్ని స్వామికి అంకితమిస్తారు.  ఈ ఉత్సవాలన్నీ వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో జరగనున్నాయి.

విమాన గోపురానికి పూర్తయిన స్వర్ణతాపడ పనులు..

నారసింహుడి గర్భగుడిపై 50.5 అడుగుల ఎత్తులో ఉన్న ఐదంస్తుల దివ్యవిమాన గోపురానికి బంగారు తాపడాల బిగింపు పనులు పూర్తయ్యాయి. దేశంలోనే అతిపెద్ద స్వర్ణ గోపురంగా యాదగిరిగుట్ట నర్సన్న విమాన గోపురం రూపుదిద్దుకుంది. ఇందుకోసం 65 కిలోల 84 గ్రాముల బంగారాన్ని వినియోగించారు. విమాన గోపురం మొత్తం 10,753 స్వ్కేర్ ఫీట్లు ఉండగా.. ఒక్కో స్వ్కేర్ ఫీట్ కు 6 గ్రాముల బంగారం పట్టింది.

ఐదు అంతస్తుల్లో ఉన్న విమాన గోపురానికి.. ఒక్కో అంతస్తులో 8 చొప్పున మొత్తం 40 దేవతామూర్తుల విగ్రహాలతో పాటు మరో 113 ప్రతిమలతో స్వర్ణతాపడం ఏర్పాటు చేశారు. దీనితో పాటు మరో 39 కలశాలకు సైతం స్వర్ణతాపడ పనులు పూర్తయ్యాయి. ఈ  బంగారు తాపడ పనులు మొత్తం చెన్నైకి చెందిన ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ చేపట్టింది. 2024 డిసెంబర్ 1న మొదలైన విమాన గోపుర స్వర్ణతాపడ బిగింపు పనులు.. 2025 ఫిబ్రవరి 15న ముగిశాయి. ఈ నెల 17లోపు ఫినిషింగ్ పనులు మొత్తం కంప్లీట్ కానున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు.

23న మహాకుంభ సంప్రోక్షణకు సీఎం రేవంత్ రెడ్డి..

ఈనెల 23న చేపట్టే మహాకుంభ సంప్రోక్షణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్, మండల చైర్మన్, ఎండోమెంట్ మినిస్టర్, జిల్లా మంత్రి, ప్రభుత్వ విప్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఈసీ అనుమతి కోరారు.  ఈసీ అనుమతి ఇస్తుందని ఈవో భాస్కర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.  మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాల సందర్భంగా ఆహ్వాన పత్రికలను పలు రాజకీయ ప్రజా ప్రతినిధులు, అధికార ప్రతినిధులతో పాటు స్వర్ణ తాపడానికి విరాళాలు ఇచ్చిన దాతలకు కూడా ఇవ్వనున్నారు.  

మార్చి 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు..

మార్చి 1 నుంచి 11 వరకు  గుట్ట దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఒకటిన స్వస్తివాచనంతో మొదలై 11న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి.  బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టాలైన ఎదుర్కోలు,  తిరుకల్యాణం,  రథోత్సవం జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరి గుట్ట  శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గర్భగుడిపై ఉన్న పంచతల దివ్యవిమాన గోపురానికి స్వర్ణ తాపడ బిగింపు పనులు శనివారంతో పూర్తయ్యాయి. దీంతో 'పంచకుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ' మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి శనివారం ఆలయ ఈవో భాస్కర్ రావు పూర్తి వివరాలు వెల్లడించారు. ఈనెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు పాంచరాత్ర ఆగమ శాస్త్రం పద్ధతుల్లో 'స్వర్ణ దివ్యవిమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవాలు' జరగనున్నాయి.

19న స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనంతో ఉత్సవాలు ప్రారంభమై.. ఈ నెల 23న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 19 నుంచి 23 వరకు 'పంచకుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగం' చేపట్టనున్నారు. ఉత్సవాల చివరి రోజైన ఈనెల 23న స్వర్ణమయమైన దివ్యవిమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు.

ఆ రోజు ఉదయం 11:54 గంటలకు మూల నక్షత్రం, వృషభ లగ్నంలో అర్చకులు.. సీఎం రేవంత్ చేతుల మీదుగా స్వర్ణవిమాన గోపురంపై సంప్రోక్షణ పూజలు చేసి బంగారు దివ్యవిమాన గోపురాన్ని స్వామికి అంకితమిస్తారు.  ఈ ఉత్సవాలన్నీ వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో జరగనున్నాయి.

రేపు నర్సన్న దర్శనం బంద్

 గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 17న మధ్యాహ్నం తర్వాత రెండున్నర గంటలపాటు స్వామివారి దర్శనం నిలిపివేస్తున్నట్లు ఈవో భాస్కర్‌‌రావు శనివారం తెలిపారు. 19 నుంచి 23 వరకు మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం నిర్వహించనున్నందున, సోమవారం ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకోసం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 గంటల వరకు స్వామివారి దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.