- స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం
- స్పెషల్ దర్శనాని 2 గంటల సమయం
యాదగిరిగుట్ట: వారాంతపు సెలవురోజు కావడంతో యాదాద్రి లక్ష్మినరసింహస్వామి క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వారాంతపు సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామి వారి సన్నిధికి వచ్చి మొక్కులు చెల్లించేందుకు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. నిన్నటి నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనం క్యూ లైన్ లో భక్తులు భారీగా బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 2 గంటలకుపైగా పడుతోంది.