దేవుడి దర్శనానికి క్యూలో నిలబడిన భక్తురాలు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో జరిగింది.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం కోసం వెళ్తున్న మహిళ గుండెపోటుతో చనిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన ముత్తమ్మ(65) అనే వృద్ధురాలు తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం(నవంబర్ 13) యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి చేరుకుంది. ఈ క్రమంలో స్వామివారి దర్శనం కోసం క్యూలైన్ లో నిలబడింది.
అయితే అప్పటివరకు బాగానే ఉన్న ముత్తమ్ము ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. యాదాద్రి ఆలయ అవరణలో భక్తురాలు గుండెపోటుతో మృతి చెందడంతో.. భక్తులు ఆందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలో అర్చకులు ఆలయాన్ని మూసివేసి.. శుద్ధి సంప్రోక్షణ చేపట్టారు. ఆలయ సిబ్బంది సహాయంతో ముత్తమ్మ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.