28 రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం.. రూ. 3. 15 కోట్లు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 28 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో 3 కోట్ల 15 లక్షల 5 వేల 35 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.  కానుకల రూపంలో 100 గ్రాముల బంగారం,  4 కిలోల 250 గ్రాముల వెండిని కూడా భక్తులు సమర్పించారని వెల్లడించారు. అదేవిధంగా విదేశీ కరెన్సీ కూడా వచ్చిందని పేర్కొన్నారు. 

విదేశీ రూపాయలు :

  • అమెరికా - 2,006 డాలర్లు
  • యూఏఈ - 110  దిరామ్స్
  • ఆస్ట్రేలియా -355 డాలర్స్
  • కెనడా -195
  • సింగపూర్ - 30
  • ఇంగ్లాండ్ - 155
  • సౌదీ అరేబియా -20
  • యూరోప్ -5
  • ఒమన్  - 1600
  • మలేసియా - 13
  • నేపాల్ - 15
  • కత్తర్- 2
  • థాయిలాండ్ - 240
  • న్యూజిల్యాండ్- 50
  • కువైట్- 4
  • ఆఫ్రికా- 50
  • బంగ్లాదేశ్- 20
  • యుగాండా-  2000
  • ఇండోనేసియా- 11,000