యాదాద్రి భువనగిరి జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీ చేతికి చిక్కాడు. జనవరి 12వ తేదీ శుక్రవారం యాదాద్రి రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి.. పోచంపల్లి మండలం కాపర్యపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి నుండి పర్మిట్ క్యాన్సల్ కుడ్రైవర్ మల్లికార్జున్ ద్వారా 50వేలరూపాయల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
ఈ ఘటనలో రూ.29వేల నగదు స్వాధీనంతోపాటు డీటీఓ సురేందర్ రెడ్డి, ఏజెంట్ అనిల్, సురేష్ లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డీటీఓ డ్రైవర్ మల్లికార్జున్ పరారీలో ఉన్నట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు.నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.